బాలిస్టిక్ క్షిపణి ఇంటర్‌సెప్టార్ టెస్ట్‌ను భారత్ విజయవంతంగా నిర్వహించింది. తొలిసారి సముద్ర ప్రాంతంలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ, భారత నౌకాదళం కలిసి శనివారం పరీక్షను నిర్వహించాయి. శత్రు దేశాలకు చెందిన బాలిస్టిక్ క్షిపణి ముప్పును పసిగట్టి నాశనం చేయడం ముఖ్య ఉద్దేశమని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో నౌకాదళంలో బాలిస్టిక్ క్షిపణి రక్షణ సామర్థ్యం కలిగిన దేశాల సరసన భారత్ నిలిచింది.