ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముమ్మరంగా గాలించిన పంజాబ్ పోలీసులు,,,స్వగ్రామంలో అమృత్‌పాల్‌ సింగ్‌‌ ను అదుపులోకి తీసుకుని అరెస్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Apr 23, 2023, 10:26 PM

నెల రోజులకుపైగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతున్న ఖలీస్థాన్ వేర్పాటువాది, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ ఎట్టకేలకు చిక్కాడు. పంజాబ్‌లోని మోగాలో ఆదివారం ఉదయం అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తన స్వగ్రామానికి శనివారం రాత్రి చేరుకున్న అమృత్‌పాల్ సింగ్.. ఈ ఉదయం అక్కడ స్థానికులు కొందరితో మాట్లాడాడు. అమృతపాల్ సింగ్ గత రాత్రి తన గ్రామమైన జల్లుపూర్ ఖేరా చేరుకుని ఉదయం ప్రార్థనలు చేసినట్లు తెలిసింది. అతడి గురించి సమాచారం అందడంతో పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టారు. దీంతో తప్పించుకునే మార్గం లేక పోలీసులకు లొంగిపోయాడు.


మార్చి 18న జలంధర్ సమీపంలో పోలీసులకు చిక్కినట్టే చిక్కి తన సహచరుడి పపల్‌ప్రీత్ సింగ్‌తో కలిసి బైక్‌పై అమృత్‌పాల్‌ పరారైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పంజాబ్ పోలీసులు అతడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇక, ఖలీస్థానీ వేర్పాటువాదిని అరెస్ట్ చేసిన పోలీసులు.. అసోంలోని దిబ్రూగఢ్ జైలుకు తరలించనున్నట్టు తెలుస్తోంది.


అమృత్‌పాల్‌ అరెస్ట్‌తో పంజాబ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. మోగాతో పాటు అతడి స్వగ్రామం జల్లుపుర్ ఖేరాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.


రెండు రోజుల కిందటే లండన్ విమానం ఎక్కేందుకు ప్రయత్నించిన అమృత్‌పాల్ భార్య కిరణ్‌దీప్ కౌర్‌‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమృత్‌‌సర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకుని మూడు గంటల పాటు ప్రశ్నించారు. ఇదిలావుంటే 


 అమృత్‌పాల్‌కు అత్యంత సన్నిహితుడు, అతడితో కలిసి పరారైన పపల్‌ప్రీత్ సింగ్‌ ఏప్రిల్ 10 పోలీసులకు పట్టుబడ్డాడు. అమృత్ పాల్ సింగ్ తప్పించుకుని తిరుగుతూ బాగా అలిసిపోయాడని, అందుకే తాను ఎక్కడున్నది కుటుంబ సభ్యులకు చెప్పాడని పపల్ వెల్లడించాడు. పోలీసులు పట్టుకోలేకపోతే తనంతట తానుగా లొంగిపోతాడని పపల్ తన సన్నిహితులకు చెప్పాడు.


వాస్తవానికి ఏప్రిల్ 14న పంజాబీలకు కీలకమైన బైశాఖి రోజున అమృత్ పాల్‌ లొంగిపోతాడనే ప్రచారం జరిగింది. అందుకే పోలీసులకు పంజాబ్ ప్రభుత్వం అప్పటి వరకూ సెలవులనూ రద్దు చేసిందనే వాదన వినిపించింది. అకాల్ తఖ్త్ ఆధ్వర్యంలో సర్బత్ ఖల్సా నిర్వహించాలని అమృత్ పాల్ సింగ్ సూచించాడు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com