భారత్ లో చైనా రక్షణ శాఖ మంత్రి లీ పెంగ్ వూ, రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు పర్యటించనున్నారు. వీరిద్దరూ వచ్చేవారం ఢిల్లీలో జరగనున్న షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొంటారు. ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, అఫ్ఘనిస్తాన్ లో భద్రత పరిస్థితి వంటి అంశాలపై SCO రక్షణ మంత్రుల సమావేశం జరగనుంది. ఈ సదస్సుకు పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ ను కూడా ఆహ్వానించారు.