మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో కడప ఎంపీ అవినాష్ అరెస్టుపై ఉత్కంఠ నెలకొంది. అవినాష్ ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ను సవాల్ చేస్తూ వివేక కూతురు సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది. సాధారణ పనిగంటలకు భిన్నంగా ఇవాళ ఉదయం 9:30 గంటలకే సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను విచారించనుంది.