ఐపీఎల్-2023లో భాగంగా నేడు సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు పోటీ పడనున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో SRH రెండు గెలుపొందింది. అటు ఢిల్లీ ఆరు మ్యాచ్‌ల్లో ఒక్కదానిలో మాత్రమే విజయం సాధించింది. మరి పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్న రెండు జట్లలో ఏ టీమ్ విజయం సాధిస్తుందో చూడాలి. హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఇవాళ రాత్రి 7:30 నిమిషాలకు మ్యాచ్ జరగనుంది.