ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వివేకా హత్య కేసు వేగంగా ధర్యాప్తు...తాజాగా ఆ జిల్లా ఎస్పీగా వ్యవహరించిన రాహుల్ దేవ్ శర్మను విచారించిన సీబీఐ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 24, 2023, 08:35 PM

మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్య కేసులో  విషయంలో గతంలో వైఎస్సార్ కడప జిల్లాకు ఎస్పీగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మను సీబీఐ అధికారులు నేడు విచారించారు. నాడు, వివేకా హత్య జరిగిన అనంతరం నియమించిన సిట్ బృందంలో రాహుల్ దేవ్ శర్మ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో, సీబీఐ నేడు ఆయనను విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 


రాహుల్ దేవ్ శర్మ నుంచి సీబీఐ అధికారులు ఇవాళ్టి విచారణ సందర్భంగా కీలక సమాచారం సేకరించారు. వివేకా కేసుకు సంబంధించి తనకు తెలిసిన సమాచారాన్ని రాహుల్ దేవ్ శర్మ సీబీఐకి సమర్పించారు. వివేకా ఇంట్లో లభించిన ఆధారాలపై సీబీఐ అధికారులు ఆయనను ప్రశ్నించారు. హైదరాబాద్ సీబీఐ కార్యాలయంలో దాదాపు 2 గంటలపాటు ఈ విచారణ జరిగింది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com