పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరిలో హరిహరుల బ్రహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం హరిహరుల కల్యాణోత్సవాలు వైభవంగా నిర్వహించారు. కామాక్షిసమేత వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. రాత్రికి కొండపై క్షేత్రపాలకుడు రాజ్యలక్ష్మీ సమేత చెన్నకేశవస్వామి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేత చెన్నకేశవస్వాముల ఉత్సవమూర్తులను అలంకరించి, కల్యాణక్రతువును భక్తి శ్రద్ధలతో ప్రారంభించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం హరిహరుల రథోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.