బెంగళూరులోని మైసూర్ సిల్క్ శారీ సెంటర్ కూడా ఇటీవల డిస్కౌంట్ సేల్ నిర్వహించింది. ఆఫర్లు అదిరిపోవడంతో చీరల కోసం మహిళలు భారీగా తరలి వచ్చారు. నాకు ఈ చీర.. నాకు ఆ చీర.. అన్నట్టుగా పోటీపడి చీరలు చూశారు. సరిగ్గా అప్పుడే ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. ఆ చీర కోసం ఒకరికొకరు పోటీ పడ్డారు. చివరికి ఇద్దరూ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. షాపు సిబ్బంది వారిని అతి కష్టం మీద విడదీయాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా.. అక్కడున్న మిగతా ఆడవాళ్లు తాము సెలక్ట్ చేసుకున్న చీరలను జాగ్రత్త చేసుకోవడం గమనార్హం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
శారీ బజార్‌ను చేపల మార్కెట్ చేశారంటూ ఓ నెటిజన్ స్పందించగా.. ఆడవాళ్లకు చీరలకు మధ్య ఉన్న అవినాభావ సంబంధం అలాంటింది మరి అంటూ మరో నెటిజన్ బదులిచ్చాడు. ఈ వీడియో ఆ వస్త్ర దుకాణానికి మంచి అడ్వర్టయిజ్‌మెంట్‌లా ఉపయోగపడుతుందని.. ఈ దేశంలో జనం భూమి కోసం, డబ్బుల కోసం, చీరల కోసం గొడవ పడతారని మరో నెటిజన్ కామెంట్ చేశాడు.