ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని పలుమార్లు నారా లోకేష్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై స్పష్టతనిచ్చారు. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్, సచివాలయ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. వీటిని పంచాయతీలకు అనుసంధానిస్తామని చెప్పారు. సర్పంచ్లకు అధికారాలు కల్పించి, గౌరలవేతనాలు పెంచుతామన్నారు.