తెలుగు రాష్ట్రాల్లో నేటినుంచి మూడు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ద్రోణి రాయలసీమ, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టం నుంచి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోంది. దీని ప్రభావంతో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. అయితే వర్షాల సమయంలో వడగండ్లు పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa