కునో జాతీయ పార్కులో నెలరోజుల వ్యవధిలో రెండు చీతాలు మృతి చెందడంతో ఈ పార్కు పులుల ఆవాసానికి, గణనకు, సంరక్షణకు అనువుగా లేదని మధ్యప్రదేశ్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ జేఎస్ చౌహాన్ తెలిపారు. నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి ఇక్కడకు తెచ్చిన 8, 12 చీతాల నివాసానికి కునో జాతీయ పార్కు ఆమోదయోగ్యంగా లేదని అన్నారు. దక్షిణాఫ్రికా నుంచి ఫిబ్రవరిలో తెచ్చిన ఉదయ్ అనే చీతా ఆదివారం మృతి చెందిందని ఆయన చెప్పారు.