కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్‌ల పని తీరుపై రాష్ట్ర లోకాయుక్త ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సోమవారం సుమోటాగా కేసు నమోదు చేసింది. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించే ల్యాబ్‌లు సరిగా పని చేయకపోవడంతో ప్రైవేటు ల్యాబ్‌లు తమ ఏజెంట్లను నియమించుకుని పేద రోగులను దోచుకుంటున్నాయని, ఈ నెల 22న పత్రికలలో కథనాలు వచ్చాయి. ఈ కథనాలపై రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి స్పందించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్‌కు, కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు సుమోటాగా నోటీసులు జారీ చేసింది. మే నెల 26వ తేదీలోగా నివేదికలను లోకాయుక్తకు సమర్పించాలని ఆదేశిస్తూ రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.