చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి పంచాయతీ కొండకింద ఎస్టీ కాలనీలో పాముకాటుతో ఓ వ్యవసాయ కూలీ మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్ళితే...... ఎస్టీ కాలనీకి చెందిన సుబ్రమణ్యం (36) వ్యవసాయ కూలీ. సోమవారం ఓ రైతుకు చెందిన వేరుశెనగపంట ఒబ్బిళ్లు చేసేందుకు వెళ్లాడు. పొలంలో పనిచేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. సహచరులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.