పొన్నూరు పురపాలక సంఘంలోని ఇంటి పన్నులు, వాటర్ కుళాయి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు వ్యాపార సముదాయం పన్నులు ఈనెల 30వ తారీకు లోపు చెల్లించిన వారికి ఐదు శాతం పన్ను రాయితీ ఇవ్వబడునని మున్సిపల్ కమిషనర్ డాక్టర్ ఎన్ రాధ మంగళవారం పత్రికా ప్రకటనలో తెలిపారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు మీసేవ కేంద్రాలలో కానీ, వార్డు సచివాలయంలో కానీ మున్సిపల్ కార్యాలయంలోని పురసేవ కేంద్రాంలోకాని పన్నులు చెల్లించవచ్చని ఆమె సూచించారు. సకాలంలో ప్రజలు పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి తోడ్పడాలని కమిషనర్ రాధా కోరారు.