సీఎం జగన్ అనంతపురం జిల్లా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. ఈనెల 17న సీఎం జగన జిల్లా పర్యటన వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 26న జిల్లాకు సీఎం రానున్నారు. ఆ మేరకు సోమవారం పర్యటన షెడ్యూల్ విడుదలైంది. నార్పల మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన రెడ్డి వసతి దీవెన సొమ్మును బటన నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు విడుదల చేయనున్నారు. 26న ఉదయం తాడేపల్లిలోని తన నివాసం నుంచి సీఎం జగన బయల్దేరి ఉదయం 9.45 గంటలకు పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో నార్పల మండల కేంద్రంలో ప్రభుత్వ బాలుర హైస్కూల్‌కు చేరుకుని అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన నార్పల క్రాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చేరుకుని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం రోడ్డు మార్గానా హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నాం 12.45 గంటల నుంచి మధ్యాహ్నాం 1.05 గంటల వరకూ వైసీపీ స్థానిక లీడర్లతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నాం 1.10 గంటలకు జిల్లాలో పర్యటన ముగించుకొని హెలిక్యాప్టర్‌లో పుట్టపర్తికి బయలుదేరి, ప్రత్యేక విమానంలో గన్నవరానికి వెళ్తారు.