టీడీపీకి చెందిన తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మునిసిపాలిటీ కమిషనర్‌పై చర్యలు కోరుతూ నడిరోడ్డుపై దీక్షకు దిగారు. పోలీసుల తీరును, కమిషనర్ అక్రమాలను నిరసిస్తూ ప్రభాకర్ రెడ్డి మంగళవారం తెల్లవారుజామున మునిసిపల్ కార్యాలయం వద్దకు చేరుకుని రోడ్డుపైనే దీక్షకు దిగారు. రోడ్డుపైనే స్నానం చేశారు. అనంతరం కౌన్సిలర్లతో కలిసి నిరసన కొనసాగించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ, అక్రమాలకు పాల్పడుతున్న మునిసిపల్ కమిషనర్‌పై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి వెళ్లేదిలేదని కౌన్సిలర్లు హెచ్చరించారు.