దేశంలో మతోన్మాదాన్ని పెంచుతున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిందేనని సీపీఐ, సీపీఎం రాష్ట్ర నాయకులు రావుల వెంకయ్య, వి.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మోదీ హటావో, దేశం బచావో ప్రచార భేరీ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సాయంత్రం రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండు వద్ద బహిరంగసభ జరిగింది. సభకు సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు తాటిపాక మధు, టి.అరుణ్, అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య, ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత పారిశ్రామిక వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కుం డ్రపు రాంబాబు, సీపీఐ, సీపీఎం నగర కా ర్యదర్శులు వీ కొండలరావు, బీ.పవన్, సీపీ ఎం నాయకురాలు బేబీరాణి పాల్గొన్నారు.