ఏపీ అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో అనంతపురం కలెక్టరేట్ వద్ద ఉద్యోగులు మంగళవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ, ఏఐటీయూసీ సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన దివాకర్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ ఖాన మాట్లాడుతూ, ప్రభుత్వం ఉద్యోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. జీతాలకు కూడా నెలనెలా టెన్షన పడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకపోవడం వల్లే ఉద్యమానికి దిగాల్సి వచ్చిందని అన్నారు. ఈ మొండి ప్రభుత్వానికి ఉద్యోగుల సత్తా చూపిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఉద్యోగుల పట్ల మొండిగా వ్యవహరించడం దుర్మార్గమని సీఐటీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఓబులు, ఏఐటీయూసి జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారెడ్డి అన్నారు. ఉద్యోగులు ఏకతాటిపైకి వచ్చి ఇలాంటి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.