అనంతపురం జిల్లా, గోరంట్ల మండలంలోని భూగానిపల్లిలో గడపగడపకు కార్యక్రమంలో ఎమ్మెల్యే శంకర్‌నారాయణను,ఒక మహిళా (భారతమ్మ ) ఎదుర్కొని , వైసీపీ నాయకులు కక్షగట్టి, అధికారుల ద్వారా అంగనవాడీ కార్యకర్త ఉద్యోగం నుంచి తనని తొలగించారు అని మళ్ళి ఏ ముఖం పెట్టుకొని నా ఇంటికి వచ్చారు అని శాపనార్ధాలు పెట్టింది. దీంతో వైసీపీ నాయకులు ఆగ్రహించారు. భారతమ్మ కుటుంబ సభ్యులతో అంతకంత పగతీర్చుకుంటామని చెప్పడంతో వారు ఆందోళనలో పడ్డారు. విషయం తెలుసుకున్న పార్థసారథి టీడీపీ నాయకులతో కలిసి భూగానిపల్లికి వెళ్లారు. రవీంద్ర, భారతమ్మ దంపతులను పరామర్శించారు. ఆమెకు జరిగిన అన్యాయాన్ని అడిగి తెలుసుకున్నారు. భయపడాల్సిన అవసరం లేదని, న్యాయం జరుగుతుందని భరోసా ఇచ్చారు. కారకులైన సీడీపీఓ, పీడీ, కలెక్టర్, ఆర్డీఓ, శిశుసంక్షేమశాఖ మంత్రికి నోటీసులు ఇప్పించాలని సూచించారు. ఆరు నెలల్లో ఉద్యోగం ఇప్పిస్తామని, ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. టీడీపీ అధికారంలోకి వస్తే బాధితులందరికీ న్యాయం జరిగేలా చూస్తామన్నారు.