బీహార్‌లోని కతియార్‌లో దారుణం చోటుచేసుకుంది. అధికార జేడీయూ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు కైలాష్ మహతోను దుండగులు కాల్చి చంపేశారు. స్థానిక పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న కైలాష్ ఇంటికి బైక్‌పై వచ్చిన దుండగులు ఆయనపై తుపాకీతో ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. కడుపుతోపాటు తలపై తీవ్రంగా గాయాలై ఆయన మృతి చెందారు. భూమి విషయంలో తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఇటీవల పోలీసులను కోరినట్లు స్థానికులు వెల్లడించారు.