కర్ణాటక మాజీ డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ పరమేశ్వరపై దాడి జరిగింది. తుమకూరు జిల్లాలోని తన నియోజకవర్గం కొరటగెరెలో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. దుండగులు రాళ్లతో దాడి చేసి తలకు గాయం చేశారు. పార్టీ నేతలు ఆయనను ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa