తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వచ్చే మే 12వ తేదీన విశాఖపట్నం జిల్లా, పెందుర్తి, అనకాపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నట్టు తెలిసింది. అనకాపల్లిలో జరిగే ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబునాయుడు పాల్గొంటారని పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. తొలుత పెందుర్తిలో జరిగే కార్యక్రమానికి హాజరైన అనంతరం అనకాపల్లి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు.