శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయాన్ని ఇండియన్ రెవెన్యూ సర్వీసు అధికారి నరసింహరెడ్డి దంపతులు సోమవారం సాయంత్రం సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి. వీర భద్రస్వామివార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయంలోని శిల్పాలు, చిత్రలే ఖనాలను తిలకించి హర్షం వ్యక్తం చేశారు. వారి వెంట ఎస్ఐ మునీర్ అహమ్మద్ తో పాటు పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa