తంబళ్లపల్లె నియోజకవర్గం పెద్ద తిప్పసముద్రం మండలం కందుకూరులో కొలువున్న వరాహలక్ష్మి నరసింహస్వామి ఉత్సవాలు వేడుకగాప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వేదపండితులు, ఆగమ అర్చకులు బుధవారం వేకువజామున గంగపూజతో ప్రారంభించి గణపతిపూజ, స్వస్తివాచన, మహాగణపతి హోమం, గోపుర కలశానికి క్షీరాభిషేఖం చేశారు. గురువారం యంత్రస్థాపన, గోపుర కలశ స్థాపన, గోపూజ అనంతరం లక్ష్మీనరసింహ స్వాములవారి కళ్యాణోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి.