కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌ది విభజించు.. పాలించు సిద్ధాంతమని పేర్కొన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయన్నారు. ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసిన సైన్యం నిజాయితీని ప్రశ్నిస్తూ.. ఉగ్రవాదులను బుజ్జగించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీజేపీ అమలు చేస్తున్న పథకాలను నిలిపివేస్తుందన్నారు.