పల్నాడు జిల్లాలో చేపట్టిన ప్రభుత్వ పథకాలను సత్వరం పూర్తి చేయాలని కలెక్టర్ శివ శంకర్ రెవెన్యూ శాఖ అధికారులను బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా స్థాయి రెవెన్యూ అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ డివిజన్ అధికారులు, తహశీల్దార్లతో రెవిన్యూ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పరిస్థితిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.