ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటు వైద్యశాలలో కాంపౌండర్, నర్సులుగా ఏడు లక్షల పైచిలుకు పనిచేస్తున్నారని శ్రీ సాయి వెంకటేశ్వర కాంపౌండర్ & నర్సుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండ్రముట్ల నాగేశ్వరరావు అన్నారు. బుధవారం తాడేపల్లి లో ఉన్న వైఎస్ఆర్సిపి కేంద్ర ప్రాంతీయ కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని కలసివినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భయంకరమైన అంటువ్యాధులు ప్రబలిన రోగులకు దగ్గరగా ఉండి వైద్యం అందించే వారే ఈ కాంపౌండర్ , నర్సులు దానికి ప్రత్యక్ష సాక్ష్యం కరోనా లాంటి మహమ్మారి వల్ల ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వారికి వైద్యం ఈ కాంపౌండర్, నర్సులు మాత్రమే అందిచారూ. వారి కుటుంబీకులను వదిలేసి సేవాపరమైన వృత్తిలో ఉన్నందుకు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవ చేశారు. కరోనా వల్ల కొందరు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉంది. ఇటు యాజమాన్యం పట్టించుకోక. అటు ప్రభుత్వాలు పట్టించుకోక చాలామంది కుటుంబీకులు రోడ్డున పడ్డ పరిస్థితి ఉన్నదన్నారు. ఈ వృత్తిలో ఉన్న వారందరూ బీసీ, ఎస్సీ , ఎస్టీ, ముస్లిం మైనార్టీ వర్గాలు వారు కావడం గమనార్హం. వెనుకబడిన వర్గాలను ఆదరించాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఎంతైనా ఉన్నదనే అభిప్రాయాని వ్యక్తపరిచారు. కాంపౌండర్, నర్సులకుకార్పొరేషన్ ఏర్పాటు చేసి నిధులు సమకూర్చాలని సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు. మీ సమస్యలను సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది.