నాదెండ్ల మండలంలోని, ఇర్లపాడు గ్రామం మరియు చిలకలూరిపేట రూరల్ మండలలోని గంగన్నపాలెం గ్రామంలోని మిర్చి, మొక్కజొన్న పంట పొలాలను బుధవారం పరిశీలించరు. మాజీ మంత్రివర్యులు, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రత్తిపాటి పుల్లారావు రైతులతో మాట్లాడి నష్టపోయిన పంట వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్తిపాటి మాట్లాడుతూ, గత కొన్ని రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం పంట తీవ్రంగా నష్టపోయింది. పంట నష్టపరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం ఇప్పటివరకు రైతులను పలకరించిన పాపాన పోలేదు? ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, శాసనసభ్యులు కానీ, ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రైతులకు నష్టపరిహారం చెల్లిస్తామని భరోసానిస్తూ వారికి నష్టపరిహారం చెల్లిస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం కనీసం పంట నష్టపరిహార అంచనాలు తయారు చేయకపోగా గడచిన రెండు సంవత్సరాలు కాలంగా పంట నష్టపోయిన రైతులకు ఎలాంటి నష్టపరిహారం అందలేదు? అకాల వర్షాలతో మిర్చి పంట తడిచిపోయి దిగుబడులు పడిపోయి ఎకరాకు 20 క్వింటాలు రావలసిన మిర్చి దిగుబడులు పడిపోవడమే కాకుండా క్వింటా 20, 000 అమ్మాల్సిన మిర్చి రకాలు 8, 000 రూపాయలకే అమ్ముకోవాల్సిన దుస్థితిలో రైతులు ఉన్నారు. కనీసం కోత కూలి కూడా రావడం లేదు.