కుప్పం డిపో గురువారం తిరువణ్ణామలై కు పౌర్ణమి సందర్భంగా రెండు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని డిపో మేనేజర్ స్వామి తెలిపారు. గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు మరియు నాలుగు గంటలకు రెండు బస్సులు కుప్పం డిపో నుండి తిరువణ్ణామలై బయలుదేరి వెల్లనుంది. బస్సుల్లో సీట్లు రిజర్వేషన్ చేసుకునే వారికి ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించబడినదని, కుప్పం బస్టాండ్ లో గల రిజర్వేషన్ కౌంటర్ వద్ద కూడా టికెట్లు తీసుకొనవచ్చునని మేనేజర్ సూచించారు. రాను పోను బస్సు చార్జీ 350 రూపాయలుగా నిర్ణయించారు.