కొందరు ఆకతాయిలు అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు. ఓ బేకరీలో మహిళ కూర్చుని ఉండగా ఓ యువకుడు ఆమెను అసభ్యంగా తాకాడు. దీంతో ఆమె ఒక్క ఉదుటన లేచి అతన్ని పట్టుకుని దాడి చేసింది. కింద పడేసి తంతూ పంచులు ఇచ్చింది. కొందరు ఆమెను అడ్డుకునేందుకు యత్నించినా అస్సలు తగ్గలేదు. ఆమె దెబ్బలకు తాళలేక సదరు యవకుడు పరుగులు తీశాడు. ఇది ఎక్కడ జరిగిందే క్లారిటీ లేనప్పటికీ నెటిజన్లు మహిళను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.