ప్రభుత్వ విధానాలతో రైతులు నష్ట పోయారని, మరోవైపు కొన్ని పత్రికల్లో ధాన్యం కొనుగోలు బేషుగ్గా సాగుతోందని ప్రచారం చేయడంపై జనసేన పార్టీ ఉంగుటూరు ఇన్ చార్జి పి.ధర్మరాజు మండిపడ్డారు. భీమడోలులోని ధాన్యం కొనుగోలు సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతు లను ధర్మరాజు, జనసేన నేతలు బుధవారం కలిశారు. నిన్నటి వరకూ గోనె సంచులు, రవాణాతో ఇబ్బందిపడిన రైతులు నేడు పండించిన పంటను వర్షం నుంచి రక్షించు కునేందుకు అనేక పాట్లు పడుతుంటే కొన్ని పత్రికలు కొనుగోలులో సమస్యలు లేవని, ఆర్బీకేలు చక్కగా పని చేస్తు న్నాయని రాయడంతో ఆ పత్రికను రోడ్డుపైనే చించి వేశారు.