ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మిక సంఘాల పట్ల ప్రభుత్వ వైఖరి మారేదాకా ఉద్యమం కొనసాగించాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. అమరావతి జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి అనంతపురం కృష్ణకళామందిర్‌లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా చైర్మన దివాకర్‌రావు మాట్లాడుతూ ఉద్యోగ వర్గాల పట్ల ప్రభుత్వం కక్ష సాధింపు కొనసాగిస్తోందని అన్నారు. న్యాయమైన డిమాండ్లు కూడా పరిష్కరించకుండా మానసిక వేదనకు గురిచేస్తున్నారని అన్నారు. అందుకే అమరావతి జేఏసీ ఉద్యమం కొనసాగిస్తోందని, అన్ని వర్గాల ఉద్యోగులు మద్దతు ఇవ్వాలని కోరారు. ఉద్యమాన్ని ఉధృతం చేసి, ప్రభుత్వానికి సత్తా చూపించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నరసింహులు, ఎస్‌టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, ఏపీటీఎఫ్1938 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కులశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి విశ్వనాథ్‌రెడ్డి, స్కూల్ అసిస్టెంట్ అసోసియేషన అధ్యక్షుడు లింగమూర్తి, ఫ్యాప్టో చైర్మన సిరాజుద్దిన తదితరులు సమావేశంలో మాటా ్లడారు. ఉపాధ్యాయ వర్గాన్ని ప్రభుత్వం చులకనగా చూస్తోందని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని, ప్రభుత్వంపై సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అమరావతి జేఏసీ ఉద్యమానికి మద్దతు ఇస్తున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రకటించారు. సమావేశంలో జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పీఎస్ ఖాన, నాయకులు అంజ నరెడ్డి, మారుతిప్రసాద్ రెడ్డి, సల్మాన బాషా, రాఘవ, ప్రసాద్, ఏఐటీయూసీ, సీఐటీయూ నాయకులు పాల్గొన్నారు.