సచివాలయ సిబ్బందిపై నగరపాలక సంస్థ అధికారుల వేధింపులు ఆపాలని సచివాలయ ఉద్యోగుల సంఘం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు కె.రామారావు డిమాండ్ చేశారు. సచివాలయ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకట కృష్ణకు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులకు నిర్ణీత పనివేళలు లేవని, ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు పని చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. యూజర్ ఛార్జీల పేరుతో వేధిస్తున్నారని, టార్గెట్‌లు పిక్స్ చేసి ప్రతిరోజు కొంతమొత్తం వసూలు చేయాలనే నిబంధనతో సచివాలయ కార్యదర్శు లు మానసిక వేదనకు గురవుతున్నారన్నారు. సచివాలయ ఉద్యోగులకు జాబ్‌చార్ట్, నిర్ణీత పనివేళలు అమలు చేయాలని, నగర పాలక సంస్థ అధిపత్యాన్ని తగ్గించాలన్నారు.