భోగాపురంలో ముఖ్యమంత్రి జగన్ కార్యక్రమం ఉండగా... అక్కడికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాసలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. అదికూడా... సీఎం నేరుగా హెలికాప్టర్లో భోగాపురం వెళ్లి, హెలికాప్టర్లోనే తిరుగు ప్రయాణమయ్యారు. అయినా సరే... వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. అదికూడా... భోగాపురానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారిని దాదాపు నాలుగు గంటలపాటు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో ట్రాఫిక్ మూడు కిలోమీటర్ల మేర స్తంభించిపోయింది. ఇదెక్కటి విడ్డురం అంటూ ప్రజలు విస్తుపోతున్నారు.