మే 23 మంగళవారం ఉదయం 11 గంటలకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర హెనిక్రిస్టిన అధ్యక్షతన గుంటూరులోని జెడ్పీ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు సీఈవో మోహనరావు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వేసవిలో తాగునీటి సమస్య, అకాల వర్షాలకు తడిసిన జొన్న, మొక్కజొన్న కొనుగోళ్ళు, ఖరీఫ్ లో అవసరమైన మిర్చి, పత్తి విత్తనాలు, ఆధునిక వ్యవసాయ పరికరాలు, కౌలు రైతులకు పంట రుణాలు తదితర అంశాలను ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సీఈవో తెలిపారు. ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు.