చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో పంట కల్లాలపై ఆరబెట్టిన మొక్కజొన్నను మండల వ్యవసాయ అధికారి బాలాజీ గంగాధర్ పరిశీలించారు. మొక్కజొన్న పంట 3 ఎకరాలు వేరుశనగ పంట కల్లాలపై ఉందన్నారు. అకాల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మొక్కజొన్న పంటను వీలైనంతవరకు నీటిలో తడవకుండా చూడాలన్నారు. కుప్పగా పోయకూడదన్నారు. మొక్కజొన్న కండలకు గాలి తగిలేలా ఇంట్లో ఆరబెట్టుకోవాలని సూచించారు. వేరుశెనగ పంట తడవకుండా సురక్షితం చేసుకుని గాలికి ఆరబెట్టుకోవాలన్నారు.