పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్ళపాడులోని బాల అంకమ్మ తల్లి దేవాలయ ప్రతిష్టకు హీరో పవన్ కళ్యాణ్ రూ. 5లక్షల విరాళం గురువారం ప్రకటించారు. తన తండ్రి వెంకట్రావు, తల్లి అంజలీ దేవి పేరుమీద దేవాలయ ప్రతిష్టకు విరాళం అందించారు. పల్నాడుతో మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ తండ్రి కొంతకాలం గురజాల ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహించారు.