అన్నమయ్య జిల్లా మదనపల్లెలో షాకింగ్ ఘటన జరిగింది. రామారావు కాలనీకి చెందిన బాబ్జీ (33), యాస్మిన్ కుటుంబ కలహాల కారణంగా కొన్నాళ్ల కిందట విడిపోయారు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి తన ఇద్దరు పిల్లలను చూసేందుకు బాబ్జీ వెళ్లగా భార్య, ఆమె కుటుంబికులు అతనితో గొడవ పడి పెట్రోలు పోసి నిప్పు పెట్టారు. స్థానికులు అతడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాబ్జీ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.