ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని పలు ఉద్యోగ సంఘాల నేతలు గురువారం కలిశారు. టీడీపీ హయాంలో తొలగించిన 500 మంది మండల సమన్వయకర్తలకు స్వచ్చాంధ్ర కార్పొరేషన్‌లో అవకాశం కల్పించటంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. సర్వే డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున సుమారు 11 వేల మంది గ్రేడ్-3 సర్వేయర్లను గ్రేడ్-2 సర్వేయర్లుగా అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినందుకు సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైయస్ జగన్‌ను కలిసిన ఏపీ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్.. కృతజ్ఞతలు తెలిపింది. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఛైర్మన్ కాకర్ల వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ జేఏసీ చైర్మన్ విఎస్ దివాకర్, సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. చిరంజీవిరావు వారి వెంట ఉన్నారు.