బ్యాంక్ ఆఫ్ బరోడా, సీఅండ్ ఐసీ విభాగంలో రెగ్యులర్ ప్రాతిపదికన 157 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఆన్ లైన్ టెస్ట్, సైకో మెట్రి టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ మే 17. పూర్తి వివరాలకు https://www.bankofbaroda.in సైట్ చూడగలరు.