రేపు దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. మొత్తం 499 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే, ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో మాత్రం నీట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. మణిపూర్ లో పరీక్షా కేంద్రాలు కేటాయించిన అభ్యర్థులందరికీ రేపు నీట్ పరీక్ష ఉండదని కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. ఆ రాష్ట్రంలో నిరసనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. సమాచారాన్ని అభ్యర్థులకు ఆటో కాల్స్, ఈ- మెయిల్స్ ద్వారా తెలియజేశారు.