మణిపూర్ తగలబడుతుంటే.. జమ్మూకశ్మీర్ లో సైనికులు చనిపోతుంటే.. కర్ణాటకలో ప్రధాని రోడ్ షోలు నిర్వహిస్తున్నారనిఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. “పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు మన సైనికులను చంపుతున్నారు. ఐదుగురు సైనికుల ప్రాణాలను బలిగొన్నారు. మణిపూర్లో హింస చెలరేగుతోంది. గ్రామాలు తగలబడుతున్నాయి. ప్రజలు తమ ఇళ్లు వదిలి పారిపోతున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం కేరళ స్టోరీ అనే ‘ఫిక్షన్’ సినిమా గురించి మాట్లాడటం విచారకరం” అని ఒవైసీ అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన సినిమా 'ది కేరళ స్టోరీ'ని నరేంద్ర మోదీ ఆశ్రయించాల్సి వచ్చింది’’ అని ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రధాని మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు.