అనంతపురం జిల్లా, తాడిమర్రి మండలంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ది కోసం ప్రతి ఒక్కరు పాటుపడాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇనచార్జ్ పరిటాలశ్రీరామ్ పిలుపునిచ్చారు. తాడిమర్రి మండల ఎస్సీసెల్ నాయకుడు ఆదివారం నిర్వహించిన పోతలయ్య స్వామి బోనాల కార్యక్రమంలో శ్రీరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదుకుంట గ్రామసమీపంలో ఉన్న పోతలయ్య స్వామిని దర్శించుకుని పూజలు చేయించారు. అనంతరం స్థానిక నాయకులతో మాట్లాడారు. మండలంలో టీడీపీ అభివృద్ధి కోసంప్రతి ఒక్కరు పాటుపడాలని కోరారు. అధికారపార్టీ చేసిన తప్పిదాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి పోరాటాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ కూచిరాము, రఘురాంచౌదరి, ముంటిమడుగు హర్ష, మాజీ ఎంపీపీ రాజశేఖర్, శ్రీనివాసరెడ్డి, విశ్వనాథ్, మల్లికార్జున, రామానాయుడు, బాస్కర్గౌడ్ పాల్గొన్నారు.