ఓ దొంగ ఏటీఎం చోరీ చేయబోయి పోలీసులకు దొరికిపోయిన ఘటన మహారాష్ట్రలోని థానేలో జరిగింది. శ్రీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏటీఎంలోకి ప్రకాశ్ షిండే అనే ఓ దొంగ చొరబడి చోరీకి యత్నించాడు. ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులకు సమాచారం వెళ్లింది. దీంతో పోలీసులు హుటాహుటిన ఏటీఎం వద్దకు చేరుకొని దొంగను అరెస్టు చేశారు. దొంగ ఏటీఎం ధ్వంసం చేయడానికి యత్నిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.