‘‘రాష్ట్రంలో వైసీపీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు మాత్రమే అమలు చేస్తూ ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నారు’’ అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు ఆరోపించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురంలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అయన మాట్లాడుతూ ‘‘జనసేన లేనిదే రాష్ట్రంలో రాజకీయాలు ఉండవు. వచ్చే ఎన్నికల్లో జనసేన ఎవరితో పొత్తు పెట్టుకుంటుందన్న దానిపై అనేక మంది విశ్లేషణలు చేస్తున్నారు. కానీ జనసేన పోటీ చేసిన అన్ని సీట్లలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నది పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ అభిమతం. అధినేత నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి. దయచేసి ఎవరూ సలహాలు ఇవ్వవద్దు.. ఏపీ భవిష్యత్తు జనసేన పార్టీ గెలుపుతోనే ముడిపడి ఉంది. పవన్ వస్తే రాష్ట్రానికి స్వర్ణయుగం, యువతకు బంగారు భవిష్యత్తు వుంటాయి. జనసేన అధికారంలోకి వస్తే వైసీపీ హయాంలో జరిగిన అన్ని భూకబ్జాలపై విచారణ జరిపిస్తాం అని తెలియజేసారు. అలానే వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయను’’ అని నాగబాబు తెలిపారు.