శ్రీకాళహస్తి పట్టణంలోని గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచార గృహం నిర్వహిస్తున్న మోహన్(55) అనే వ్యక్తిని 1టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. తేరువీధి నుంచి సన్నిధి వీధిలోకి వెళ్లే సందులో ఉన్న ఓ ప్రైవేటు లాడ్జీలో నలుగురు మహిళలతో లాడ్జీ నిర్వాహ కుడు మోహన్ వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. దూరప్రాంతాల నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు నిర్ధారించారు. వ్యభిచార గృహం నిర్వహణ కింద మోహన్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే మోహన్ బహిరంంగా వ్యభిచారం నిర్వహించేందుకు కొందరి సహకారం ఉన్నట్లు పోలీసు అధికారులు గుర్తించారు. దీనిపై ఉన్నతాధి కారులకు కూడా సమాచారం అందించినట్లు తెలిసింది. అసాంఘిక కార్యకలాపాలకు సహకరించే వారిపై మరింత లోతుగా నిఘా పెట్టి తగు చర్యలు తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం.