ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేతలకు, జనసైనికులకు దిశా నిర్దేశం చేసిన నాగబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 08, 2023, 07:45 PM

రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ అరాచక పాలనతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల భవిష్యత్తుతో ఆటలాడుతున్నారని.. ప్రజల సమస్యలను, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేశారని ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం హరిపురంలో ఎలమంచిలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ పాలన తీరుతో విసుగు చెందిన ప్రజలు మంచి పాలనకోసం ఎదురు చూస్తున్నారని.. జనసేన అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి జరుగుతుందన్నారు.


అవినీతిలేని పాలన అందుతుందన్నారు. పవన్‌ అధికారంలోకి వస్తే అన్ని పంటలకు గిట్టుబాటు ధర ఇప్పిస్తారన్నారు. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తున్న పవన్‌కళ్యాణ్‌ను ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికి పోవాలన్నారు నాగబాబు. అప్పుడే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీ పొత్తులపై చర్చలు వద్దన్నారు. జనసేన తరఫున ఎవరు పోటీ చేస్తే వారిని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని కోరారు. రాష్ట్రంలో ప్రజల్లో చైతన్యం మొదలైందని.. ఈసారి జనసేనకు వచ్చే ఓటింగ్ శాతం పెరిగిందిన్నారు. గత ఎన్నికల్లో 7 శాతం ఓట్లు వస్తే.. ఈ సారి నంబర్ 35శాతానికి పెరిగిందని అంచనాలు చెబుతున్నాయన్నారు.


పవన్‌కి సలహాలు ఇవ్వొద్దని.. ఆయన నిర్ణయాన్ని గౌరవించాలన్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని నాయకులు రూ. లక్షల కోట్లు స్వాహా చేస్తుంటే.. ప్రజలకు మంచి చేయడానికి డబ్బులు ఎందుకు ఉండవో చెప్పాలన్నారు. ఎలమంచిలి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కన్నబాబురాజు అరాచకాలు చేస్తున్నారని మండిపడ్డారు పార్టీ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుందరపు విజయకుమార్‌. ప్రజా సంక్షేమాన్ని, నియోజకవర్గం అభివృద్ధిని పక్కన పెట్టిన కన్నబాబురాజు.. ఎమ్మెల్యే మాత్రం అభివృద్ధి చెందారని ధ్వజమెత్తారు.. వచ్చే ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతామని అన్నారు.


వీరులకు పుట్టుకే కానీ గిట్టుక ఉండదన్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మహనీయుల చైతన్యం సదా ప్రసరిస్తూనే ఉంటుందన్నారు. వారు రగిల్చిన విప్లవాగ్ని ఎప్పటికీ ఆరిపోదని.. అలాంటి ధీరుడే మన అల్లూరి సీతారామరాజు అంటూ వర్థంతిని స్మరించుకున్నారు. అల్లూరి సీతారామరాజుకు భారతరత్న ప్రకటించాలని.. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకోవాలన్నారు. నేటి తరం దేశవాసులందరికీ అల్లూరి సీతారామరాజు సంకల్పం, పోరాట పటిమ, మృత్యువుకు భయపడని నైజం, జ్ఞాన-ఆధ్యాత్మిక సంపదలు ఆదర్శమన్నారు. అలాగే అల్లూరి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పెద్ద ఎత్తున నిర్వహించాలన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa