మోదీని ఓడించండి, దేశాన్ని రక్షించండి అనే నినాదంతో దేశ వ్యాప్తంగా ముందుకు వెళ్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో మాత్రం మోదీ, జగన్ హటావో అంటూ కార్యక్రమాలు చేపడతామన్నారు. జగన్, మోదీ ఇద్దరు రహస్య బంధం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. జగన్ చరిత్ర, దుర్యోధనుడి చరిత్ర ఒకేలా ఉంటాయని వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు అచ్చోసిన ఆంబోతుల్లా 30 మందికి పైగా సలహాదారులు ఉన్నారన్నారు. రాజన్న పేరు చెప్పి ఆయనకే జగన్ మూడు నామాలు పెడుతున్నారని మండిపడ్డారు. బటన్ నొక్కితే సమస్యలు పరిష్కారం కావని హితవుపలికారు. బంకర్లలో కూర్చుని జగనన్నకు చెప్పండి అంటే ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. మోదీ నుంచి బయటకు వచ్చిన మరుక్షణం జగన్ జైలుకు వెళ్తారన్నారు. బీజేపీతో సయోధ్య ఉన్న పార్టీలతో జతకట్టేది లేదని స్పష్టం చేశారు. మణిపూర్ ఘటనల నేపథ్యంలో అక్కడి నుంచి బయటకు రావాలంటే రూ.2500 ఉన్న టికెట్ ధరలను రూ.25 వేలు చేశారని మండిపడ్డారు. ఎయిర్ పోర్టులు ప్రజల సొమ్ముతో కట్టి విమాన సర్వీసులను మాత్రం ప్రైవేట్ వాళ్లకు ఇవ్వటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తున్నారన్నారు. విశాఖ ఉక్కు రాష్ట్ర ప్రభుత్వాలు కొనాలంటే ఇవ్వమంటున్నారని.. కేవలం ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారట అంటూ సీపీఐ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa