ఈనెల 4న నెల్లూరు జిల్లా, ఉదయగిరి మండలంలోని దాసరిపల్లికి చెందిన ఓ వివాహిత ఆనారోగ్యంతో నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలకు చికిత్స కోసం వెళ్ళింది. చికిత్స చేయించుకొని తిరిగి స్వగ్రామానికి వెళ్లేందుకు రాత్రి పది గంటలకు ఉదయగిరి పంచాయతీ బస్టాండ్‌కు చేరుకొందన్నారు. ఆ సమయంలో ఎలాంటి వాహనాలు లేకపోవడంతో ఓ ఆటోను అద్దె తీసుకొని స్వగ్రామానికి బయలుదేరింది. మార్గమధ్యంలో ఆటోడ్రైవర్లు సయ్యద్ రహీమ్, షేక్ ఖాన్షాలు దాసరిపల్లి గ్రామ సమీపంలో ఉన్న జామాయిల్ తోటలోకి ఆటోను మళ్లించి ఆమెపై అత్యాచారం చేయబోగా ఆమె కేకలు వేస్తూ రోడ్డుపైకి పరుగులు తీసింది. దీంతో నిందితులు అక్కడ నుంచి ఆటోతో సహ పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో నిన్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు నెల్లూరు జిల్లా, ఉదయగిరి సీఐ వీ.గిరిబాబు పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి ఉదయగిరి కోర్టులో హాజరుపర్చినట్లు సీఊ తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.