నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణంపై పోరాటం ప్రారంభమైంది. రూరల్ కార్యాలయంలో క్రైస్తవ మత పెద్దలు, పలు చర్చిల ఫాదర్లతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తి చేసేంత వరకు పోరాటం చేయాలని నిర్ణయించారు. ముందుగా మంత్రి కాకాణి, అధికారులకు సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టింగులు, పోస్టుకార్డులు పంపిస్తూ నిరసన తెలిపారు.